Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే .అయితే ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి విమర్శలు చేసే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. అందుకు కారణం పవన్ వ్యవహార శైలి అని చెప్పాలి.
తాజాగా ప్రొడ్యూసర్ చిట్టిబాబు పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక అబద్దాల కొరివి అని ఆయన చెప్పే మాటలన్నీ కూడా అధికారం కోసమే మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలోకి రాకముందు జగన్ ప్రభుత్వంలో పవన్ మాట్లాడుతూ 32,000 మంది అమ్మాయిలు మాయమయ్యారని చెప్పారు మరి పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ 32,000 మంది అమ్మాయిలు ఆచూకీ తెలియలేదు.
కాకినాడలో గంజాయి అమ్ముతున్నారని అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇక పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వయిరీ లో డ్రై ఐస్అంటూ నివేదికలు ఇచ్చారు. పవన్ గతంలో పాచిపోయిన లడ్లు అంటూ కామెంట్స్ చేశారని, కేవలం అధికారంలోకి వచ్చేందుకు, ఇతరులను ఇరకాటంలో పెట్టేందుకు పవన్ ఎంతకైనా తెగిస్తారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేసిన క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని తెలిపారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం కోసమే బహిరంగ సభలలో కూడా అందరిని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడారు కానీ ఇప్పుడు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక అమ్మాయిపై రేప్ జరిగితే మాత్రం మాట్లాడటం లేదని తెలిపారు. ఇలా అధికారం కోసం నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతూ మాయ చేశారని చిట్టిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.