అతను నా పిల్లలు జోలికి వచ్చాడు… అసలు వదలను: బెల్లంకొండ సురేష్

bellamkonda suresh

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై ఇటీవల చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ “రూ. 85 లక్షల తీసుకున్నానని నాపై ఆరోపణ వచ్చింది. నాకు చేడ్డ పేరు తీసుకరావడానికే శరణ్ ఈ ఆరోపణలు చేశాడు. కోర్టులో పిటీషన్ వేశాడు. నా పిల్లలు జోలికి వచ్చాడు. శరణ్‌ను చట్టపరంగానే ఎదుర్కొంటాను. అయనపై పరువు నష్టం దావా వేస్తాను. ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి” అంటూ తనపై కేసు వేసిన వ్యక్తిపై ఫైరయ్యారు. తన దగ్గర రూ.85లక్షలు తీసుకుని, తనను మోసం చేశారని నిర్మాత బెల్లకొండపై శరణ్ అనే వ్యక్తి గతంలో కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది.