Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే మహిళ మరణించడం ఆమె కుమారుడు గాయాలు పాలు కావడం జరిగింది. ఈ విధంగా అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో జైలుకు కూడా వెళ్లి రావాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఈ కేసు నుంచి అల్లు అర్జున్ పూర్తిగా బయటపడ్డారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా కమెడియన్ ప్రియదర్శి అల్లు అర్జున్ అరెస్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియదర్శి తాజా చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నో బడీ’. ఈ సినిమా రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
ఇక ఈ సినిమా మార్చ్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ కేసు మాకు ఈ సినిమాకు చాలా ఉపయోగపడిందని తెలిపారు. అల్లు అర్జున్ బెయిల్‌కి సంబంధించి ఈ కేసు విచారణలో న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉపయోగించిన భాషను గమనించిన ‘కోర్ట్’ చిత్ర బృందం, కోర్ట్ సినిమాలోని డబ్బింగ్‌ను మరింత సహజంగా తీర్చిదిద్దినట్లు తెలిపాడు.
ఇలా అల్లు అర్జున్ అరెస్టు అవడం ఆయన కేసు కోర్టులో వాదించిన విధానం మాకు ఉపయోగపడింది అంటూ ప్రియదర్శి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి ఇక ఇటీవల నాని కూడా ఈ సినిమా చూసి నచ్చకపోతే నేను నటించే హిట్ 3 కూడా ఎవరు చూడదు అంటూ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాయి.
