PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో “హర్ హర్ మహాదేవ్” కీర్తనతో సభా ప్రాంతమంతా ధ్వనించింది. వివిధ పూజలు, ప్రార్థనలు చేసిన అనంతరం ప్రధాని గంగలో స్నానం చేశారు.
Special day for us all. Inauguration of Shri Kashi Vishwanath Dham. https://t.co/Kcih2dI0FG
— Narendra Modi (@narendramodi) December 13, 2021
ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్‌లో ఫోటోలను పంచుకుంటూ “కాశీలో మైమరచిపోయాను” అని ట్వీట్ చేశారు. మరొక పోస్ట్‌లో పవిత్ర స్నానం చేస్తున్న ఫోటోను పంచుకుంటూ ప్రేమ,ఆశీర్వాదం అందిస్తున్న గంగా నదికి ధన్యవాదాలు తెలిపారు. గత వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని ప్రారంభించిన మూడో ప్రాజెక్టు ఇది. ఈ నెలలో మరో రెండు కార్యక్రమాల కోసం ఆయన మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు బీజేపీ ప్రభుత్వం యూపీలో ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసమేనంటూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో సహా ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ఆమోదించిన సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుందని అఖిలేష్ యాదవ్ విలేకరులతో అన్నారు. ‘సరయూ కెనాల్’ ప్రాజెక్టుకు సంబంధించి 75 శాతం పనులు తన హయాంలోనే పూర్తి చేశామన్నారు. ఎన్నికల కోసం మోదీ చేస్తున్న గిమ్మిక్కులను నమ్మొద్దని యూపీ ప్రజలను యాదవ్ కోరారు