*పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా నటించిన “బబ్లీ బౌన్సర్” ట్రైలర్ విడుదల*

పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం బబ్లీ బౌన్సర్. ఈ చిత్రంలో తమన్నా లేడి బౌన్సర్ గా కనిపించనుంది.
ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. నటి తమన్నా భాటియాను మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపిస్తున్నారు దర్శకుడు మధుర్.
ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
తాజాగా “బబ్లీ బౌన్సర్”చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం.
ఈ ట్రైలర్ లో ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో తమన్నాను చూడవచ్చు.
దర్శకుడు మధుర్ భండార్కర్ దృష్టిలో, తన ఐకానిక్ ఆన్‌స్క్రీన్ పాత్రలకు పేరుగాంచిన బాబ్లీ బౌన్సర్ ఒక సంతోషకరమైన సరదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇందులో ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు!
ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అవుతోంది!