తెలుగు స్టార్ హీరోల మీద ప్రశాంత్ నీల్ స్టేట్మెంట్ అదుర్స్ కదా

Prashanth Neel about doing movies with Telugu stars
Prashanth Neel about doing movies with Telugu stars
 
దక్షిణాది టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయన చేసిన ‘కెజిఎఫ్ 2’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం మీద ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ ఒక్క సినిమా మీదే కాదు ఆయన ఒప్పుకుంటున్న ప్రతి ప్రాజెక్ట్ సెన్సేషన్ అవుతోంది. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అవి కూడ తెలుగు హీరోలతోనే కావడం విశేషం.
 
వరుసపెట్టి తెలుగు హీరోలతో ఆయన సినిమాలు ఒప్పుకుంటుండటం, మన పెద్ద హీరోలు చాలామంది ఆయన కోసం ధారాళంగా డేట్స్ కేటాయిస్తామని ఆఫర్లు ఇస్తుండటంతో టాలీవుడ్ స్టార్లంతా ఆయన వెంటపడుతున్నారనే వాతావరణం క్రియేట్ అయింది. 
 
కన్నడ జనాలైతే తెలుగులో దర్శకులు లేక ప్రశాంత్ నీల్ చుట్టూ తిరుగుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.  ఈ వాతావరణం మన హీరోల అభిమానులకు కాస్త ఇబ్బందికరంగా మారింది.  తమ హీరో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయడం సంతోషకరమే కానీ ఇలా వేరే దారి లేక వెంటపడుతున్నారనడం సరికాదని అనేవారు ఉన్నారు. 
 
అయితే ప్రశాంత్ నీల్ మాత్రం హీరోలంతా తన చుట్టూ తిరుగుతున్నారనే భావనలో లేరు. తాను స్టార్ హీరోలకి అవకాశాలు ఇవ్వట్లేదని, స్టార్లే తనకు వాళ్ళతో పనిచేసే అవకాశం ఇస్తున్నారని అన్నారు.  దీన్నిబట్టి మన హీరోల పట్ల ఆయనకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రశాంత్ నీల్ తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలతో పాటు ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.