Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో బిజెపి తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బిజెపి తీసుకునే నిర్ణయాలను కూడా ఈయన తప్పు పడుతున్నారు. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని కూడా తప్పుపడుతున్నారు. ఇలా తరచూ ఏదో ఒక సంచలనమయినటువంటి పోస్ట్ ద్వారా ప్రకాష్ రాజ్ వార్తలలో నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈయన భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరిట యుధం ప్రారంభించింది. మూడు రోజులపాటు సరిహద్దు ప్రాంతాలలో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఉన్నఫలంగా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని కాల్పులకు విరమణ ఇచ్చారు.
ఇలా పాకిస్తాన్ భరతం పట్టకుండా ఒప్పందం కుదుర్చుకొని భారత్ వెనకడుగు వేయడంతో చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకొని ఒప్పందం కుదిరిచ్చిందని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
డియర్ సుప్రీం లీడర్.. అమెరికా పాకిస్థాన్‌లోకి వెళ్లి అక్కడ తలదాచుకున్న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను చంపినప్పుడు అది న్యాయం అంటారు. మరి భారత్ అదే చేస్తే.. కాల్పుల విరమణ ఎందుకు? ఏ ఒప్పందం మీద ఈ కాల్పుల విరమణ అంగీకరించారో చెప్పగలరా?’ అని తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నిస్తూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇలా ఈ ట్వీట్ ద్వారా పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారని మరోసారి బిజెపి వైఖరిని తప్పు పట్టారని తెలుస్తుంది.