Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి సినిమాల గురించి అలాగే జనసేన ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి పార్టీని ఎంతో అభివృద్ధి పరుచుకొని నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అయితే గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా వేడుకలో భాగంగా చిరంజీవి కరాటే రాజు అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. ఆయన 17 ఏళ్ల క్రితం తనతో కలిసి ప్రజారాజ్యంలో పనిచేశారన్నారు చిరంజీవి. ఆ తర్వాత జై జనసేన అని అన్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా కేకలు వేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీనే ప్రస్తుతం జనసేనగా మారిపోయిందని ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది ఐ యాం వెరీ హ్యాపీ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం చిరంజీవి మాటలను పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు. చిరంజీవి జనసేన పార్టీ మంచి విజయం సాధించిన తర్వాత ప్రజారాజ్యమే జనసేన అంటూ మాట్లాడటం సరికాదని తెలిపారు. గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీని నడిపిస్తూ పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు కానీ ఆ సమయంలో ఏనాడు చిరంజీవి ప్రజారాజ్యమే జనసేన అంటూ మాట్లాడలేదు.
ఇప్పుడు జనసేన పార్టీ మంచి సక్సెస్ అందుకొని పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ప్రజారాజ్యమే జనసేన అంటూ మాట్లాడటం సరీ కాదని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఇప్పుడు జనసేనని బిజెపిలో విలీనం చేస్తారు అంతే కదా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
