Spirit: టాలీవుడ్ స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అయితే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే స్పిరిట్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు. ఆయన లుక్ ఎలా ఉండనుంది లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ వార్త నిజంగా అభిమానులకు భారీ శుభవార్త అని చెప్పాలి. అదేమిటంటే.. ప్రభాస్ లైనప్ లో మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ స్పిరిట్.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా మీద ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక్కో అప్‌డేట్ తో ఆ అంచనాలను డబుల్ చేస్తున్నారు మూవీ మేకర్స్. సినిమా ఎనౌన్స్‌మెంట్ టైమ్ లోనే ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని చెప్పిన సందీప్ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ మూవీలో డార్లింగ్ క్యారెక్టర్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పోలీస్ పాత్రతో పాటు గ్యాంగ్‌స్టర్ గా, లవర్ భాయ్ గా డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారట ప్రభాస్. ప్రస్తుతానికి ఈ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ అప్‌డేట్ ను డార్లింగ్ ఫ్యాన్స్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుంటున్నారు.