Prabhas And Maruthi : ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ – మారుతి ల సినిమాని ఐతే ఊహించని లెవెల్లో రిలీజ్ చేస్తారట.!

Prabhas And Maruthi : ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత బిజీ బిజీ గా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకదాన్ని మించి ఒకటి భారీ సినిమాలతో తన లైనప్ ని ఒక ప్రాసెస్ లో సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభాస్ ఎంచుకుంటున్న లైనప్ లో ఓ అంశం ప్రతి ఒక్కరినీ చాలా ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. ఒక్కో సినిమాకి ఒక్కో దర్శకుడు పేరు వినిపిస్తుండగా అభిమానులు సహా ఆడియెన్స్ కూడా అవాక్కవుతున్నారు.

మరి రీసెంట్ గా షాక్ ఇచ్చిన అంశం అయితే ప్రభాస్ దర్శకుడు మారుతి తో సినిమా చేస్తున్నాడని వచ్చిన వార్త. ఇది వినడానికే షాకింగ్ గా ఉన్నా ఇది నిజమేనట. ఈ కాంబోలో సినిమా ఉన్నట్టుగా ప్రభాస్ వర్గాలే చెబుతుండగా ఈ సినిమా హర్రర్ కం కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉండడం ఖాయం అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై కూడా ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఏకంగా ఈ చిత్రాన్ని 10 భాషల్లో రిలీజ్ చేస్తారట. మన దేశంలో 5 ముఖ్య భాషలతో పాటు జాపనీస్, చైనీస్ సహా మరిన్ని భాషలు కలిపి 10 భాషల్లో రిలీజ్ చేస్తారని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని మరో టాక్ ఉంది.