మీకు తెలుసా.? ప్రబాస్, ఆకాష్ పూరీ ఛైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అట.!

Prabhas Akash And A Childhood Friendship | Telugu Rajyam

ప్రబాస్ వయసు ఎక్కడ.? ఆకాష్ పూరీ వయసు ఎక్కడ.? వీళ్లిద్దరూ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారబ్బా.? అని ఆలోచించేస్తున్నారా.? అయితే మీకీ వైరల్ న్యూస్ తెలియాల్సిందే. ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ చిత్రం మరి కొద్ది రోజుల్లో రిలీజ్‌కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రబాస్ జోరుగా పాల్గొంటున్నాడు. ప్రబాస్ ఎంట్రీతో సినిమా రేంజ్ వేరే లెవల్‌కి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే, ‘రొమాంటిక్ డేట్ విత్ ప్రబాస్’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశారు. అందులో భాగంగా హీరో, హీరోయిన్లను ప్రబాస్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.

ఆ ఇంటర్వ్యూని ప్రబాస్ స్టార్ట్ చేసిన విధానం ఫన్నీగా ఆకట్టుకుంటోంది. నెట్టింట ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ వేలో కాకుండా, చాలా క్యాజువల్‌గా ఈ ఇంటర్వ్యూ సాగింది. ఇందులోనే ప్రబాస్, నేనూ, ఆకాష్ చిన్నప్పటినుంచీ కలిసి పెరిగాం..’ అంటూ హీరోయిన్ కేతికతో అనడం వెరీ ఫన్నీ. ‘బుజ్జిగాడు’ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో నటించాడు ఆకాష్.

ప్యాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, పూరీ కోసం డార్లింగ్ ప్రబాస్ ‘రొమాంటిక్’ ప్రమోషన్స్‌ని ఇంత పర్సనల్‌గా తీసుకోవడం నిజంగా గొప్ప విశేషం. దటీజ్ డార్లింగ్.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles