Prabhas: త్రిషతో ప్రభాస్ బ్రేకప్… వీరి కాంబోలో మిస్సయిన 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!

Prabhas: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలలో వరుసగా నటిస్తే చాలు వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తూ ఉంటాయి అయితే కొన్ని సందర్భాలలో ఈ వార్తలు నిజం కూడా అవుతూ ఉంటాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి వార్తలలో నిలిచారు.

ఇకపోతే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం తరచూ ఇలాంటి వార్తలలో నిలుస్తుంటారని చెప్పాలి. ఈయన త్రిష ,అనుష్క, కృతి సనం వంటి హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు అంటూ ఇప్పటికీ కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రభాస్ మాత్రం త్రిషతో నిజంగానే ప్రేమలో పడ్డారని కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ త్రిష ఇద్దరి కాంబినేషన్లో వర్షం వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత పౌర్ణమి బుజ్జి గాడు వంటి వరుస సినిమాలలో నటించడంతో వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి. అయితే త్రిషతో బ్రేకప్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని పలువురు డైరెక్టర్లు భావించారట అలాంటి వారిలో రాజమౌళి ముందు వరుసలు ఉన్నారని తెలుస్తోంది

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాకు ముందుగా త్రిషను ఎంపిక చేయగా ప్రభాస్ మాత్రం త్రిషను తీసుకుంటే నేను సినిమాలు చేయనని చెప్పేసారట అందుకే త్రిష స్థానంలో అనుష్క నటించారని తెలుస్తుంది అలాగే సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాలో కూడా త్రిషను తీసుకోవాలని భావించారట అయితే అక్కడ కూడా ప్రభాస్ అదే ఆన్సర్ చెప్పిన నేపథ్యంలో శ్రద్ధ కపూర్ ఎంపిక అయ్యారు.

ఇక ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రభాస్ తో కలిసి స్పిరితి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా త్రిష అయితే బాగుంటుందని సందీప్ రెడ్డి భావించారట అయితే ప్రభాస్ వద్దకు వెళ్లి ఈ విషయం గురించి చెబితే కచ్చితంగా నో అనే ఆన్సర్ వస్తుందని భావించిన సందీప్ రెడ్డి తదుపరి హీరోయిన్ కోసం సెర్చ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఒకవేళ ప్రభాస్ త్రిష కనక ఈ సినిమాలలో నటించి ఉంటే మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వారి ఖాతాలో ఉండేవని చెప్పాలి.