Bhavadeeyudu Bhagat Singh : పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్‌సింగ్’: భీభత్సమైన అప్‌డేట్ ఇదే.!

Bhavadeeyudu Bhagat Singh

Bhavadeeyudu Bhagat Singh : ‘వకీల్ సాబ్’‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కి అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంటుగా ‘భీమ్లానాయక్’ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేశారు. ఇక ఇప్పుడు ‘భవదీయుడు భగత్‌సింగ్‘  (Bhavadeeyudu Bhagat Singh) అంటూ రికార్డులు తిరగరాయడానికి మరోసారి రెడీ అయిపోతున్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారట. ప్యాన్ ఇండియా హంగులతో ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది.

విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ మూవీ ‘మిమి’లో నటించిన పంకజ్ త్రిపాఠి పేరు ఇప్పటికే ఫిక్సయ్యింది. ఈ సినిమాలో ఈయన కీ రోల్ పోషిస్తున్నారట. అలాగే, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక, హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు వినిపిస్తోంది. గతంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో పూజా హెగ్దే గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుందట పూజా హెగ్దే.