Pawan Kalyan: దర్శకనిర్మాతలకు అలాంటి కండిషన్ లు పెట్టిన పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రాబోయే రెండేళ్లలో పవన్ కళ్యాణ్ పూర్తిగా బిజీగా మారనున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు విడుదల అయి ఉండేవి. కానీ కరోనా మహమ్మారి వల్ల అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకనిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అదేవిధంగా కొన్ని కండిషన్లు కూడా పెట్టాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. మరొకవైపు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి అయ్యింది. వీటితో పాటుగా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్.

అయితే ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అయితే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకులకు పవన్ కళ్యాణ్ పెట్టిన కండిషన్ 60 రోజుల్లో సినిమా పూర్తి చేయడం. తాను ఒక సినిమాకు కేవలం 60 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని.. ఆ రెండు నెలల లోపు షూటింగ్ పూర్తి చేయాలి అనే కండిషన్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ నిజంగా సూపర్ కండిషన్ పెట్టారు.. ఎందుకంటే 60 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయడం కంటే కావాల్సింది మరొకటి లేదు. మరి పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ లకు అనుగుణంగా దర్శకనిర్మాతలు పని చేస్తారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.