Pawan Kalyan: బిగ్ బీ ని కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈయన రీ ఎంట్రీ తర్వాత నటించిన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో సందడి చేయనున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమా ఓ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ ను కలుసుకున్నట్లు సమాచారం. అమితాబచ్చన్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ క్రమంలోనే అమితాబచ్చన్ రామోజీ ఫిలింసిటీలో ఉన్నారనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా అమితాబ్ బచ్చన్ ను కలిసి ఆయనతో మాట్లాడారు. ఇలా ఉన్నఫలంగా పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ తో కలవడానికి గల కారణం ఏమిటి వీరిద్దరూ ఎందుకోసం సమావేశమయ్యారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇందులో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే అలాగే దీపికా పదుకొనే ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.