పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ స్టైల్ కు, మేనరిజంకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసేలా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం లక్ష రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో చిరంజీవి తమ్ముడిగా మాత్రమే తనకు గుర్తింపు ఉండటంతో పవన్ కళ్యాణ్ తక్కువ రెమ్యునరేషన్ కు సైతం ఓకే చెప్పడం గమనార్హం. అయితే అనతికాలంలోనే హీరోగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగింది.

పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలు పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కగా హరిహర వీరమల్లు సినిమా మాత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పవన్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. పవన్ ఈ సినిమాలో దొంగగా కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దర్శకుడు క్రిష్ కెరీర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం కానుంది. పవన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో పాటు వినోదాయ సిత్తం రీమేక్ లో కూడా నటించనున్నారని సమాచారం అందుతోంది.