పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సాధించకపోయినా తర్వాత సినిమాలు వరుసగా విజయాలను సొంతం చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జల్సా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన పవన్ ఆ తర్వాత వరుసగా విజయాలను సాధించారు.
గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు సక్సెస్ సాధించి పవన్ పాపులారిటీ మరింత పెరగడానికి కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించారనే విమర్శ ఉన్నా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు అంచనాలను మించి విజయం సాధించాయి. పవన్ రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అయితే అందించలేదు.
కొన్ని ఏరియాలలో ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదని సమాచారం. 2019 సంవత్సరంలో అధికారికంగా పవన్ కళ్యాణ్ వెల్లడించిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ కు 52 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులలో చరాస్థుల విలువ 12 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పులు 34 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.
అయితే గత మూడేళ్లలో పవన్ కళ్యాణ్ ఆస్తులు, అప్పులలో కొంతమేర మార్పు వచ్చి ఉండవచ్చు. పవన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే పవన్ తన రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని పేద ప్రజల కోసం ఖర్చు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.