పుష్ప 2 బాలీవుడ్ స్టార్ హీరో?

‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సారి తన క్రేజ్ మరింత క్రేజ్ పెంచుకునేందుకు ‘పుష్ప 2 ‘ తో సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్న టీం, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్ హీరో గా, రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసారు. తాజా సమాచారమే ప్రకారం ఈ సీక్వెల్ లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఒక కీ రోల్ లో నటిస్తున్నాడని టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం అర్జున్ కపూర్ కి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఈ మధ్య చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ కామియో లో నటించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ రోల్ పై ఇంకా క్లారిటీ రాలేదు.