డబుల్ హ్యాట్రిక్ కొట్టి, ఫుల్ జోష్‌లో ఉన్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే. ఇప్పుడెక్కడ విన్నా పూజా జపమే. అక్కినేని హీరోకి ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ ఇచ్చి క్వీన్ అయిపోయింది పూజా హెగ్దే. ఇక వరుసగా బిగ్ ప్రాజెక్టులతో ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
ప్రబాస్‌తో ‘రాధేశ్యామ్’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ఆచార్య’.. తమిళ హీరో విజయ్‌తో ‘బీస్ట్’ ఇలా నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు ఇప్పటికే పూజా హెగ్దే చేతిలో ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్టులు పూజా కోసం వెయిటింగ్‌లోనూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తన పర్సనల్ లైఫ్‌కి ప్రాధాన్యత ఇస్తానంటోంది పూజా హెగ్దే. తక్కువ నిద్రపోతుందట. కానీ, సిస్టమేటిగ్గా తన డైలీ లైఫ్‌ని సెట్ చేసుకుంటానని చెబుతోంది అందాల పూజా హెగ్దే. అలాగే, వరుస షూటింగులు చాలా ఒత్తిడిని కలిగిస్తాయని ఆ ఒత్తిడి నుండి దూరం కావడానికి మ్యూజిక్ వింటానని చెబుతోంది పూజా హెగ్దే.
మ్యూజిక్ ఒత్తిడిని దూరం చేయడంలో భలే మ్యాజిక్ చేస్తుందట. మంచి బూస్టప్ ఇస్తుందట. కాసేపు మ్యూజిక్ వింటే చాలు ఎక్కడ లేని రిఫ్రెష్‌మెంట్ వస్తుందంటోంది. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడంలో మరో క్రేజీ టిప్ కూడా చెప్పుకొచ్చింది పూజా హెగ్దే. అదేంటంటే, ఒక్క ఐదు నిముషాలు మనసారా ఏడ్చేస్తే, తనలోని ప్రెజర్ అంతా బయటికి పోతుందని ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది హాట్ హాట్ పూజా హెగ్దే. పూజా ఈజ్ సో క్రేజీ యు నో.