డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసిన డస్కీ బ్యూటీ.!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా వద్ద మాంచి క్రేజ్ ఉన్న లక్కి హీరోయిన్స్ లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకరు. ఇప్పుడు తాను ఏ సినిమా చేసినా కూడా హిట్ తప్ప మరో మాట లేదు. అందుకే ఇండస్ట్రీ పాలిట బంగారు బాతులా మారిన ఈ హీరోయిన్ ను తమ సినిమాలకు వీలయినంత త్వరగా లాక్ చేసేసుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ తన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తో హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో మొత్తం తాను 5 హిట్స్ అందుకుంది. ఇక డబుల్ హ్యాట్రిక్ మాత్రం తన భారీ సినిమా “రాధే శ్యామ్” కొడతానని స్పష్టంగా చెప్పేస్తుంది. తన రోల్ ప్రేరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మరింత మంది స్టార్ హీరోల సినిమాల్లో బిజీ గా ఉంది.