పూజా హెగ్డేకు ఇంత డిమాండ్ ఏంటండీ బాబు

Pooja Hegde in Mahesh, Trivikram movie
Pooja Hegde in Mahesh, Trivikram movie
‘ముకుంద’ సినిమాతో మొదట సినిమానే పరాజయాన్ని చవిచూసిన పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం దూసుకుపోతోంది.  వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ రఫ్ఫాడిస్తోంది.  ‘మహర్షి, అల వైకుంఠపురములో’ లాంటి సినిమాలు భారీ విజయాల్ని సాధించడంతో ఆమె లక్కీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది.  పెద్ద సినిమాలకు తగిన హీరోయిన్ అనే ఫీడ్ బ్యాక్ అందుకుంది.  టాలీవుడ్లో ఏ పెద్ద హీరో సినిమా చేసినా వారి జాబితాలో పూజా తప్పకుండా ఉండాల్సిందే.  
 
ప్రజెంట్ పూజా చేతిలో ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’, చరణ్, చిరుల ‘ఆచార్య’ ఉండగా ఇటీవలే విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడ పూజానే కథానాయకిగా తీసుకున్నారు.  ఇక తాజాగా ఆమెను మరొక భారీ ఆఫర్ వరించింది.  మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమాలో పూజా హెగ్డేనే కథానాయకిగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.  మహేష్, పూజాల కాంబినేషన్లో ‘మహర్షి’, పూజా, త్రివిక్రమ్ కలయికలో ‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.  అందుకేనేమో మహేష్, త్రివిక్రమ్ ఆమెనే తమ సినిమా కోసం తీసుకోవాలని అనుకుని ఉండవచ్చు.