పవన్ సినిమాలో రోల్ కోసం పూజా హెగ్డే బానే ఫీల్ అవుతుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో ఎప్పుడు లేని స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన సినిమాల్లో తన ఫ్యాన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేస్తున్న భారీ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గానే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేస్తుంది అని కన్ఫర్మ్ కూడా చేసేసారు.

అయితే మరి నిన్న పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో హరీష్ విషెష్ చెప్పగా ఇప్పుడు పూజా దానికి థాంక్స్ చెప్తూ పవన్ సినిమాలో ఈసారి నాకు ఎలాంటివో రోల్ డిజైన్ చేసారో అని ఎక్సయిటింగ్ గా ఫీల్ అవుతూ రిప్లై ఇచ్చింది. ఇది వరకే హరీష్ శంకర్ తో డీజే, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో కనిపించి పూజా మరపించింది.ఆ అందుకే ఇక పవన్ సినిమాలో రోల్ పై ఇంతలా ఎక్సయిట్ అవుతుంది.