బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అనగానే, హీరోయిన్ సెంట్రిక్ అనే భావన ఉంటుంది. కథంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇప్పుడు ఆ భాస్కర్, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాని తెరకెక్కించాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
అఖిల్ కంటే, పూజా హెగ్దే బాగా ఎలివేట్ అవుతోందంటూ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా విషయమై సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షక లోకంలోనూ చర్చ జరుగుతోంది. పూజా హెగ్దే ఇప్పుడున్న హీరోయిన్లలో హాట్ ఫేవరేట్. అఖిల్ ఇంతవరకూ సక్సెస్ అందుకోలేదు. దాంతో పూజా హెగ్దే ఈ సినిమాకి పబ్లిసిటీ పరంగా ట్రంప్ కార్డ్ అవుతుంది.
బహుశా ఈ కారణంతోనే పూజా హెగ్దేని ఎలివేట్ చేస్తున్నట్లున్నారు. కథలో కూడా పూజా హెగ్దేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఈ చర్చ సంగతి పక్కన పెడితే, అఖిల్ – పూజా మధ్య ఆన్ స్ర్కీన్ కెమిస్ర్టీ బాగానే వర్కవుటయినట్లు సినిమా ప్రోమోస్ చూస్తే అర్ధమవుతోంది.
అన్నట్లు పూజా హెగ్దే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందే అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విషయానికి వస్తే, అఖిల్ ఈ సారి గ్యారంటీగా హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.