సస్పెన్స్ లో పెట్టిన పూజా హెగ్డే.. ఆ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..??

ప్రెజెంట్ సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజ్ మరియు గుర్తింపు తో ఉన్న స్టార్ హీరోయిన్ లలో డస్కీ గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకరు. అయితే పూజా కి ఒకప్పుడు అంటే సూపర్ సక్సెస్ లు ఉండేవి కానీ ఇప్పుడు ఆమె సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యి కూర్చుంటున్నాయి. అయినా కూడా ఈ యంగ్ బ్యూటీ కి ఆఫర్స్ తగ్గడంలేదు. ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా బడా హీరోలతోనే అవకాశాలు వస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా ఈమె ఒక నేషనల్ మీడియా సంస్థ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరీర్ లో ఓ సినిమా కోసం చెప్పడం సర్వత్రా సస్పెన్స్ గా మారింది. తాను ఇప్పుడు ఒక భారీ సినిమా ఒప్పుకున్నా అని, అది ఇంకా అనౌన్స్ కాలేదని చెప్పింది. దీనితో ఇప్పుడు ఆ సినిమా ఏ సినిమా ఎవరితో సినిమా అని అంతా చర్చించుకుంటున్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ఒక భారీ ఏక్షన్ ప్రాజెక్ట్ కాగా తాను కూడా ప్రొఫెషనల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నానని తెలిపింది.

దీనితో రాబోయే రోజుల్లో చేసే ఆ ప్రాజెక్ట్ ఎవరితో అనే చర్చ వస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో చేయబోయే 16వ సినిమా కోసం ఎక్కువగా చర్చ వస్తుంది. అయితే ఈ సినిమా కూడా పూజా మాటల ప్రకారం తాను ఉన్నట్టు అనౌన్స్ కాలేదు. పైగా తాను కూడా ఏక్షన్ సినిమా అని చెప్పింది. దీనిని దర్శకుడు కొన్నాళ్ల కితం కన్ఫర్మ్ చేసాడు.

అంటే ఈ లెక్కన ఈ క్రేజి ప్రాజెక్ట్ లో పూజా ఫిక్స్ అని అనుకుంటున్నారు అంతా.. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే పూజా మరియు చరణ్ లు ఆచార్య లో కనిపించారు. మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం అయితే చరణ్ శంకర్ సినిమాలో బిజీగా ఉండగా పూజా హెగ్డే పలు సినిమాల్లో బిజీగా ఉంది.