Pooja Hegde : వైరల్ ఫోటో : హీటెక్కించడానికి ఆ సినిమా సెట్స్ లో పూజా హెగ్డే.!

Pooja Hegde : వేసవిలో సినిమాల సందడి అంతా వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగులో అయితే ఓ సరైన ఎంటర్టైనర్ పడితే దానికి తిరుగే ఉండదు. మరి అలనాటి ఎంటర్టైనర్ ని డబుల్ డోస్ తో తీసుకొస్తున్నామని దర్శకుడు అనీల్ రావిపూడి మరియు నిర్మాత దిల్ రాజు లు తీసుకొస్తున్నారు.
ఆ సినిమానే “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ కౌర్ లు హీరోయిన్స్ గా నటించిన గత సినిమా “ఎఫ్ 2” భారీ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ ఐటెం సాంగ్ చేస్తున్నట్టు మేము తెలిపాము. మరి ఇపుడు దీనిని నిజం చేస్తూ చిత్ర యూనిట్ ఒక ఫోటో రిలీజ్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. ఆ సాంగ్ కి గాను పూజా హెగ్డే రెడీ అయ్యినట్టు సెట్స్ నుంచి ఆమె ఫోటో చిత్ర యూనిట్ షేర్ చేశారు.
అంతే కాకుండా ఈ సాంగ్ తో వేసవిని మరింత హీట్ ఎక్కించడానికి రెడీగా ఉండాలని అంటున్నారు.
మరి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ఈ ఐటెం నెంబర్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ఫోటో నే వైరల్ అవుతుంది.
https://twitter.com/SVC_official/status/1514841381293883396?s=20&t=Zv-o6tLuEOlI-sdu_O2mcg