నటీనటులు విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్
నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ & మద్రాస్ టాకీస్
సంగీతం AR. రెహమాన్
సినిమాటోగ్రఫీ రవి వర్మన్
‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాలతో నేషన్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న మణిరత్నం ఇండియాలోనే ఒక టాప్ డైరెక్టర్. అయితే కొన్నాళ్లుగా మణిరత్నం రేంజ్ హిట్ మాత్రం రావడం లేదు. మధ్యలో ఏవో ఒకటి, రెండు సినిమాలు ఓ మాదిరి హిట్ అయినా కానీ మణిరత్నం మార్క్ హిట్స్ మాత్రం కాదు.
మణిరత్నం కెరీర్ మొదటినుండి ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది. అదే కల్కి కృష్ణమూర్తి రాసిన నవలకి. దీనిమీద సినిమా తియ్యాలని మణిరత్నం చాన్నాళ్ళనుండి అనుకుంటున్నాడు, ఇప్పటికి అది నిజమైంది.
విక్రమ్, ఐశ్వరాయ్ రాయి, త్రిష, కార్తీ, జయం రవి వంటి స్టార్స్ ఉండడంతో ఈ సినిమా కి కావలసినంత హైప్ వచ్చింది, కానీ తెలుగు లో మాత్రం సినిమాను ప్రమోట్ చేయడంలో మేకర్స్ పూర్తిగా విఫలమయ్యారు. భారీ అంచనాలతో సినిమా ఎట్టకేలకు విడుదలైంది మరియు ఆలస్యం చేయకుండా సినిమా చూడదగ్గదా లేదా అని తెలుసుకుందాం.
కథ
సినిమా ఎలా ఉంది:
‘బాహుబలి’ ఇచ్చిన ధైర్యంతో చాలా మంది రాజులకథలు, పురాణకథలను సిల్వర్ స్క్రీన్ పై తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసారు, కానీ చాలా వరకు అవి ఫెయిల్ అయ్యాయి.
అయితే, మొదటిసారి హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నం, మరియు చాలా మంది గొప్ప నటులు ఈ చిత్రంలో భాగం కావడం చాలా మంది ని ఎక్సైట్ చేసింది.
చోళ చరిత్రను పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలై, అన్ని ముఖ్య పాత్రలను పరిచయం చేసిన తర్వాత ఈ సినిమా బోరింగ్ డ్రామాతో సినిమా ట్రాక్‌ను కోల్పోతుంది. ఉన్నత నిర్మాణ విలువలతో గ్రాండ్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ కథాబలం తో నడిచే చిత్రం. స్క్రీన్ ప్లే పర్లేదు అనిపిస్తుంది.
అయితే చోళుల చరిత్ర గురించి తెలుగు వాళ్ళకి తెలియకపోవడం వలన తమిళ్ తప్ప వేరే భాష ప్రేక్షకులు వారి భాషలో చూస్తున్న వారు సినిమాతో మరియు పాత్రలతో డిస్‌కనెక్ట్ అయ్యే స్కోప్ చాల ఉంది.
ప్లస్ పాయింట్లు:
తారాగణం
ప్రదర్శనలు
సంగీతం
నేటివిటీ
ఓవరాల్ గా చెప్పాలంటే, విసువల్ గా సినిమా చాలా బాగున్నప్పటికి ఒక ప్రాంతానికి చెందిన చరిత్ర, నేటివిటీ కావడం సినిమాకు ఒకింత మైనస్. తమిళంలో ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చేలా కనిపిస్తుంది, కానీ ఇతర భాషల్లో మాత్రం కష్టమే.