‘వకీల్ సాబ్’ సినిమాపై రాజకీయ కక్ష సాధింపు.!

Political Revenge On Vakeel Saab

Political Revenge On Vakeel Saab

కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా తీవ్రంగా నష్టపోయింది. పరిశ్రమను గట్టెక్కించేందుకు పరిశ్రమ పెద్దలు తమవంతు కష్టపడుతున్నారు.. పరిశ్రమను ఆదుకోమని ప్రభుత్వాలని కోరుతున్నారు.. ప్రభుత్వాలూ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అయితే, ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో మాత్రం కక్ష సాధింపు చర్యలు ఎదురయ్యాయి.. అదీ ఆంధ్రపదేశ్‌లో. సినిమా రిలీజ్‌కి ముందు స్పెషల్ షోలనేవి సర్వసాధారణం. టిక్కెట్ ధరల పెంపు కూడా అంతే. కరోనా పాండమిక్ తర్వాత విడుదలైన చాలా సినిమాల విషయంలో ఇవన్నీ వర్తించాయి. కానీ, ‘వకీల్ సాబ్’ సినిమాకి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అనేక ఆంక్షల్ని విధించింది. టిక్కెట్ ధరల్ని పెంచుకోవడానికి వీల్లేదనేసింది..స్పెషల్ షోలకీ ఆస్కారమివ్వలేదు. అదనపు షోలు వేసుకోవడానికీ ఒప్పుకోలేదు. వెరసి, ‘వకీల్ సాబ్’ సినిమా ఆంధ్రపదేశ్‌లో తీవ్ర ఇబ్బందుల్నే ఎదుర్కొంటోంది. అయితే, అది పవన్ కళ్యాణ్ సినిమా. ఇలాంటి ఆంక్షలేవీ.. పవన్ కళ్యాణ్ సినిమా విజయాన్ని అడ్డుకోలేవన్నది నిర్వివాదాంశం. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది గనుక.. అంటూ వైసీపీ మద్దతుదారులు కుంటి సాకులు చెబుతున్నారు. అలాగైతే, మొత్తంగా థియేటర్లను మూసేసుకోవాలి.. లేదంటే, 50 శాతం ఆక్యుపెన్సీ అనాలి. అదే సమయంలో రాజకీయ పార్టీల మీటింగులకీ అవకాశం ఇవ్వకూడదు.

అధికార పార్టీ నేతల అడ్డగోలు రాజకీయాలు, పబ్లిసిటీ స్టంట్లు మామూలే. ఎన్నికల వేళ ఓటర్లకు డబ్బులు పంచడమూ మామూలే. పవన్ కళ్యాణ్ సినిమా కదా.. ‘వకీల్ సాబ్’ అన్న టైటిల్‌ని చూసి బహుశా అధికార పార్టీ భయపడి వుండొచ్చన్న చర్చ ఇప్పుడు సామాన్యుల్లో జరుగుతోంది. ఇక, తెలంగాణలో మాత్రం ‘వకీల్ సాబ్’ సందడి కనీ వినీ ఎరుగని రీతిలో కనిపిస్తోంది. విదేశాల్లోనూ ‘వకీల్ సాబ్’ జోరుకి ఆకాశమే హద్దు. సినిమాలో కంటెంట్ వుంటే.. ఎన్ని ఆంక్షలైనా సినిమాని అడ్డుకోలేవ్.