Crime News: దమ్మాయిగూడ లోని ఎం ఎల్ ఆర్ కాలనీలో నివాసముంటున్న అనంతలక్ష్మి అనే ఓ మహిళ పేద మహిళల అవసరాలను ఆసరాగా తీసుకొని వారితో వ్యభిచారం చేయిస్తూ బయటపడింది. ఒంటరిగా ఉన్న మహిళలను, కళాశాలకు వెళ్లిన యువతులకు మాయమాటలు చెప్పి వారిని అందులోకి దింపి వారి ద్వారా డబ్బులు సంపాదిస్తుంది.
అంతేకాకుండా ఈవిడ గతంలో మానవ అక్రమ రవాణా పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా వ్యభిచారం చేయిస్తుందని తెలియటంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశాడు. ఆమె చంచల్గూడ జైలులో పోలీసుల అదుపులో ఉంది.