హైపర్ ఆది పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో తన పంచ్ డైలాగులతో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా పోలీసులు స్టేజ్ పై ఉన్నటువంటి హైపర్ ఆదిని అరెస్టు చేసి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా పోలీసులు హైపర్ ఆదిని తీసుకెళ్లడంతో ఎంతోమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు హైపర్ ఆదిని పోలీసులు అరెస్టు చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా వేదికపైకి వచ్చిన పోలీసులు హైపర్ ఆది ఒక రోడ్ యాక్సిడెంట్ చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు చావుబతుకులలో ఉన్నాయని అందుకోసమే తనని అరెస్ట్ చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఈ విషయం తెలిసే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బహుశా మీరు పొరపాటు పడి వచ్చి ఉంటారు సార్ అని అక్కడున్న వారు చెప్పగా పొరపాటు పడలేదని, కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చామని తెలిపారు.ఈ విషయం గురించి పక్కకెళ్లి మాట్లాడదామని పిలవగా పోలీసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హైపర్ ఆదిని వేదికపై నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ కావడంతో కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం వారు ఎప్పటిలాగే ఈసారి కూడా రేటింగ్స్ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.