Pithapuram: అన్నా క్యాంటీన్ శిలాఫలకం… మాయమైన ముఖ్యమంత్రి పేరు… ఇది తగునా పవన్!

Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవగా ఆయన ఇతర శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను చూసుకోవటం కుదరడం లేదు. ఇలా సమయం లేకపోవడంతో నియోజకవర్గ బాధ్యతలు అన్నిటిని కూడా తన అన్నయ్య ఎమ్మెల్సీ నాగబాబుకి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు నాగబాబుకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఈయన ప్రభుత్వ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు ఇటీవల ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇలా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పిఠాపురంలో ఎమ్మెల్సీగా పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఈ క్రమంలోనే గొల్లప్రోలు గ్రామంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం ప్రస్తుతం సంచలనంగా మారింది సాధారణంగా ఏదైనా ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అందులో ఉంటుంది కానీ ఇక్కడ అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అదేవిధంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు కూడా దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలను మరోసారి బయటపడేలా చేసింది. ఇక ఎందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవడంతో అసలు శిలాఫలకంపై ముఖ్యమంత్రి పేరు లేకపోవడం ఏంటి అంటూ తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇక నాగబాబు పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ చెందినవారు జై వర్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విషయం తెలిసిందే.