Pitapuram: పిఠాపురానికి పోటెత్తునున్న జనసంద్రం…. అప్రమత్తమైన జనసేన!

Pitapuram: పిఠాపురం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఊరి పేరు మారుమోగిపోతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలలోనే సంచలనంగా మారారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని చెప్పాలి.

ఇకపోతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు అయితే మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన భావించింది కానీ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని ఒక రోజుకు మాత్రమే కుదించారు దీంతో 14వ తేదీ జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్ల విషయంలో జనసేన అప్రమత్తమైందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సినీ నటుడు అని చెప్పాలి సాధారణంగా ఈయన ఏదైనా ఒక బహిరంగ సభ నిర్వహిస్తే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలి వస్తుంటారు అలాంటిది డిప్యూటీ సీఎం హోదాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారంటే పెద్ద ఎత్తున పిఠాపురానికి అభిమానులు తరలి రాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోని అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా నిర్వహిస్తున్నారు.

సుమారు 5 లక్షల మందికి పైగా అభిమానులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. పొరపాటున ఏదైనా జరిగితే వాటిని దుష్ప్రచారం చేయటానికి వైసిపి కాచుకొని కూర్చున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు అన్నింటిని కూడా ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మరి మార్చి 14వ తేదీ జరగబోయే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలను చేయబోతున్నారనీ పవన్ ప్రసంగం పైనే పూర్తిస్థాయిలో ఆసక్తి నెలకొంది.