Perni Nani: పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ పై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మేము ఎంతో తపన పడిన చిత్ర పరిశ్రమకు ఏ మాత్రం కృతజ్ఞత లేదని ఇప్పటివరకు చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలవలేదు. ఇకపై సినిమాకు సంబంధించి వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడటానికి ఎవరూ కూడా రావద్దు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇలా పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ గురించి అలాగే సినీ పెద్దల గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజల గురించి ఆలోచించి ప్రజలు తక్కువ రేటుకే సినిమాను చూసి అనుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు.
పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్‌ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా..?. నీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరిస్తారా?. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా దిగజారి పోవాలా అంటూ ప్రశ్నించారు.
ఇక కూటమి ప్రభుత్వంపై కూడా నిప్పులు జరిగారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోతున్నారని ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లాలంటే కూడా ముఖం చల్లట్లేదని తెలిపారు. సంపద సృష్టిస్తాను అంటూ 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 సంవత్సరాల ఆవేశం, రెడ్డి బుక్ స్టార్ మూటలు కట్టుకొని సంపద పెంచుకుంటున్నారు అంటూ పేర్ని నాని కూటమినేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.