‘బీజేపీ’ గెలిస్తే దాన్ని వదిలేస్తానన్న ‘పీకే’… నవ్వుతున్న జనం 

People laughing about Prashant Kishor's twitter challenge 

ప్రశాంత్ కిశోర్.. పొలిటికల్ స్ట్రాటజిస్ట్..  ఈయన పేరు పాపులర్ అయిందే బీజేపీతో.  బీజేపీ మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సంస్థ దేశానికి తెలిసింది.  అప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి రాజకీయ పార్టీలు, నేతలు పీకే పేరును తలుచుకుంటూ ఉంటారు.  పీకే పక్కనుంటే గెలుపు తథ్యమనే భావం ఏర్పడింది అందరిలో.  ఇక తెలుగు రాష్ట్రాల మీద కూడ పీకే ప్రభావం గట్టిగానే ఉంది.  వైసీపీ 2019 ఎన్నికల కోసం భారీ మొత్తం చెల్లించి పీకేను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది.  వైసీపీ గెలుపు కోసం పీకే వేసిన ప్రతి ప్లాన్ పక్కగా వర్కవుట్ అయింది.  అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, సోషల్ మీడియా క్యాంపెనింగ్, సర్వేలు ఇలా ప్రతి అంశంలోనూ పీకే వేసిన ఎత్తులు ఫలించి వైసీపీ 151 సీట్ల మెజారిటీని సాధించింది.  దాంతో ఆయన పేరు మరింత పెరిగింది.  ఏపీలో పీకే రాబట్టిన ఫలితాన్ని చూసి మమతా బెనర్జీ ఆయన్ను నియమిచుకున్నారు. 

త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఇప్పటి నుండే ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి.  ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ ,భాజపాల నడుమే ఉండనుంది.  మొత్తం 294 స్థానాలు ఉన్న ఇక్కడ 200 సీట్లు సాధిస్తామని బీజేపీ అంటోంది.  మమతా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదని కంకణం కట్టుకున్నారు.  అలాగని ఆమెకు అనుకూలమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా అంటే అదీ లేదు.  ఈ దఫా పాలనలో పలు విపరీతాలు చోటు చేసుకున్నాయి.  కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంది పనులు జరుపుకోవాల్సిన ముఖ్యమంత్రి చిన్న సాకు దొరికినా కేంద్రంతో  కయ్యానికి సై అంటున్నారు.  మోదీ, అమిత్ షా మీద నిప్పులు చెరుగుతున్నారు.  దేశంలో బీజేపీ అత్యంత తీవ్రంగా వ్యతిరేకించే నేత ఎవరైనా ఉనానరు అంటే అది మమతానే.  అయినా బీజేపీ పట్టు వదలడం లేదు.  మమతా ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.  తృణమూల్ పాలనలో రైతాంగం దెబ్బతినడం, నిరుద్యోగం పెరగడం, జీవం ప్రమాణాలు దిగజారిపోవడం లాంటి పలు అంశాలను ఎత్తిచూపుతున్నారు.  

People laughing about Prashant Kishor's twitter challenge 
People laughing about Prashant Kishor’s twitter challenge

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి  లాక్కుంటున్నారు.  అమిత్ షా రోడ్ షో సందర్బంగా 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీలో చేరారు.  చేరికలు ఇంకా పెరుగుతాయని బీజేపీ నేతలు అంటున్నారు.  ఈ పరిణామం మమతా బెనర్జీకి తలవంపులైంది.  పార్టీ మొదలైన నెగెటివ్ ప్రచారాన్ని తగ్గించడానికి పీకేను ఉసిగొల్పారు.  పీకే పనితనమంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది.  అందుకే ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన మీడియా ప్రచారం చూసి ఏదో ఊహించుకుంటున్నారని, 200 సీట్లలో విజయం సాధించి బెంగాల్‌లో ఈసారి అధికారం చేపడుతామన్న అమిత్‌ షా పాచికలు పారవని అన్నారు. కనీసం రెండంకెల సీట్లు కూడా కాషాయ పార్టీ గెలుచుకోలేదని పీకే జోస్యం చెప్పారు.  బెంగాల్‌లో బీజేపీ ఇప్పుడున్న దానికన్నా ఏమాంత్రం మెరుగైనా తన ట్విట్టర్ ఖాతాను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు.  

ఈ ఛాలెంజ్ చూసి సామాన్య జనం కూడ నవ్వుకుంటున్నారు.  బీజేపీ గెలుపుకి, తన ట్విట్టర్ ఖాతాను పణంగా పెట్టడం ఏంటి అంటున్నారు.  బీజేపీ గెలిస్తే ఐప్యాక్  సంస్థను నిలిపివేస్తాననో, ఓటమిని అంగీకరించి బీజేపీని తక్కువ అంచనా వేశానని ఒప్పుకుంటాననో అంటే సమంజసంగా ఉండేది కానీ మూడున్నర లక్షల మంది ఫాలోవర్లు కూడా లేని ట్విట్టర్ ఖాతాను వదిలేస్తానని అనడం పిల్లల తరహా శపథంలా ఉందని నవ్వుతున్నారు.