ఆ హాట్ బ్యూటీని చూస్తే అవాక్కవ్వాల్సిందే

Pelli Sandadi Actress In A Stunning Avatar | Telugu Rajyam

‘మా పెరటి జామ్ చెట్టు పళ్లన్నీ కుశలం అడిగే..’ అంటూ ‘పెళ్లి సందడి’ సినిమాలో అందాలొలకబోసిన అమ్మడు రవళి గుర్తుంది కదా.. 90లలో గ్లామర్ హీరోయిన్‌గా కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ రవళి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అభిమానులే కాదు, ఆమెతో స్ర్కీన్ షేర్ చేసుకున్న హీరోలు సైతం ఆమెను చూసి అవాక్కయ్యారు.

25 ఏళ్ల తర్వాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనే నాటి అందాల భామ రవళి దర్శన భాగ్యం కలిగింది. అయితే, రవళి అప్పటిలా అస్సలు లేనే లేదు. చాలా బొద్దుగా మారిపోయింది. ఈ ఈవెంట్‌కి వచ్చిన వారంతా ఆమెను చూసి షాకయ్యారందుకే. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తదితరులు రవళిని అస్సలు గుర్తు పట్టనేలేకపోయారట.

ఇకపోతే, రవళికి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలేమైనా ఉన్నాయా.? అంటే, అదేమీ లేదంటోంది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా.. అని చెప్పింది రవళి. ఇన్నాళ్ల తర్వాత తన సూపర్ హిట్ మూవీ ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో సినిమా రూపొందడం చాలా సంతోషంగా ఉందనీ, ఈ సినిమా కూడా సంచలన విజయం అందుకోవాలని కోరుకుంటున్నాననీ చెప్పింది. శ్రీ లీల, రోషన్ జంట చూడ ముచ్చటగా ఉందని అభివర్ణించింది రవళి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles