ఒక్క ఇండియన్ సినిమా దగ్గరే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ క్రేజ్ అనన్య సామాన్యం. భారీ లెవెల్లో క్రేజ్ ఉన్నా కూడా రజినీ కి ఇప్పుడు మాత్రం గడ్డుకాలం అలానే ఉంది. రజినీ స్థాయికి తగ్గ హిట్ ఓవరాల్ గా చూడాలని అంతా ఎదురు చూస్తున్నారు. అలా తన లేటెస్ట్ సినిమా “పెద్దన్న” పై అంచనాలు పెట్టుకున్నారు.
కానీ వాటికి తగ్గట్టుగా ఒక్క తమిళ్ మార్కెట్ లో సినిమా భారీ వసూళ్లు అందుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద పరిస్థితి అసలేం బాగోలేదని చెప్పి తీరాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 12 కోట్లకి అమ్ముడు పోగా ఇప్పుడు ఇందులో సగం కూడా వచ్చేలా లేదని తెలుస్తుంది.
మొదటి రోజు నుంచే డల్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగులో రిలీజ్ అయ్యిన అన్ని సినిమాల్లో కల్లా అతి తక్కువ వసూళ్లు అందుకొని పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోవడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరి ఫైనల్ గా పెద్దన్న ఎంత నష్టాలు మిగులుస్తాడో చూడాలి.