నాగ్ సినిమాలో నేను చేయట్లేదు బాబోయ్ అంటున్న హాట్ బ్యూటీ

Payal Rajput not doing special song in Bangarraju

Payal Rajput not doing special song in Bangarraju

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి.  2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది.  ఈ చిత్రంలో  నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది.  దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని గతంలోనే నిర్ణయించుకున్నారు.  సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ కూడ నిర్ణయించారు. స్క్రిప్ట్ కూడ సిద్ధమైంది. ప్రజెంట్ ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒక స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు మొదలయ్యాయి.  ఈ హాట్ బ్యూటీ ఇదివరకు స్పెషల్ సాంగ్స్ చేసి ఉండటంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారు చాలామంది.  కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చేసింది పాయల్.  తాను ఎలాంటి ప్రత్యేక గీతంలోనూ నటించట్లేదని క్లారిటీ ఇచ్చింది.  ఇకపోతే పాయల్ రాజ్ పుత్ పలు భాషల్లో సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడ చేస్తోంది.