పవన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాపై వైరల్ పోస్ట్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లైఫ్ అంతా కూడా ఒకింత ఆసక్తి గా ఉంటుందని చెప్పాలి. ఒక్కో సినిమాకి ఎన్నెన్నో మార్పులు పవన్ సినిమాల్లో కనిపోయిస్తుంటాయి. సినిమా టెక్నీషియన్స్ నుంచి కానీ ఏకంగా సినిమాలే మారిపోయిన సందర్భంలు కూడా ఉన్నాయి. అయితే పవన్ కెరీర్ లో కొన్ని వదులుకున్నవి అనుకోని ఆగిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.

వాటిలో ఒకటే “సత్యాగ్రహి” సినిమా. ఎప్పుడో 2003 లో అనుకోని ఆగిపోయిన సినిమా ఇది. మూవీ లవర్స్ కి పవన్ అభిమానులుకి ఈ సినిమా కోసం తెలిసే ఉండొచ్చు. అయితే అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో పవన్ ఇప్పుడు వివరణ ఇవ్వడం వైరల్ అయ్యింది. ఈ సినిమాకి ప్రేరణ

అయ్యినటువంటి లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి జయంతి కారణంగా అప్పుడు ఈ సినిమా అనుకున్నాం అని అయితే వారి అడుగు జాడల్లో ఆ సినిమాలో నడిచి చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా చేయకుండానే బయట ఆయన స్పూర్తితో అడుగుజాడల్లో నడుస్తున్నానని తెలిపారు. ఇలా అసలు అప్పుడు ఆ సినిమా ఎందుకు ఆగిందో పవన్ వివరణ ఇప్పుడు ఇవ్వడం జరిగింది.