Bheemla Nayak : ఇండస్ట్రీ టాక్ : “భీమ్లా నాయక్”ని చూసిన పవన్..కానీ సినిమా తనకి నచ్చిందా?

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలు నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ పై భారీ స్థాయి అంచనాలు నెలకొనగా రీసెంట్ గానే ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్స్ ని కూడా అనౌన్స్ చేసారు.

అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచీ మంచి కాన్ఫిడెంట్ గా ఉండగా ఒక కీలక అప్డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం తాలుకా ఫస్ట్ కాపీ ని పవన్ కళ్యాణ్ నిన్ననే చూడడం జరిగిందట. తాను త్రివిక్రమ్ సహా దర్శకుడు సాగర్ మరియు ఇతర చిత్ర బృందం కలిసి చూశారట.

అయితే అసలు పవన్ కి ఇప్పుడు వరకు సినిమా నచ్చిందా లేదా అని టాక్ వినిపిస్తుంది. పవన్ కి కూడా సినిమా యూనిట్ తో పాటు విపరీతంగా నచ్చిందట. దీనితో ఈ చిత్రంపై చిత్ర బృందంకి మరింత కాన్ఫిడెంట్ తెచ్చుకున్నారట. దీనితో ఈ సినిమా మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఫైనల్ గా భీమ్లా నాయక్ రిలీజ్ కోసం వేచి చూడాల్సిందే.