ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు పార్టీల మధ్య పొత్తులాట ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ పవన్ ఓ ట్వీట్ చేశారు. రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారితే దాని వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవాలని.. అప్పటివరకు మనల్ని ఒక్కసారిగా పొగడటం ప్రారంభిస్తారని అన్నారు.
ఇక వారి పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు అని చప్పట్లు, ఎమోజిలు పెడితే ప్రత్యర్థులు లక్ష్యం నెరవేరినట్లే అని.. అప్పటివరకు తిట్టిన వారు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు ఆలోచించాలి అని.. అది మైండ్ గేమ్ లో ఒక భాగం అని తెలుసుకోవాలి అంటూ పవన్ అన్నారు. ఇక పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.