పవన్ కళ్యాణ్ మరోసారి గొంతు సవరిస్తున్నాడా ?

Pawan to sing a song in remake

Pawan to sing a song in remake

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్. నటన మాత్రమే కాదు డైరెక్షన్, రైటింగ్, స్టంట్ కొరియోగ్రఫీ చేయగలరు. వీటితోపాటు పాటలు కూడ పాడగలరు. పాటలంటే నార్మల్ సాంగ్స్ కాదు సినిమాలో ఏదైనా జానపద గీతాలను వినిపించే అవకాశం ఉంటే పవన్ తప్పకుండా మైక్ అందుకుంటారు. ‘తమ్ముడు, జానీ, ఖుషి, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ ఇలా పలు సినిమాల్లో పవన్ పాటలు పాడి మెప్పించారు. ఆయన ఎప్పుడు పాట పాడినా అది సూపర్ మాస్ సాంగ్ అయిపోతుంటుంది. ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

అందుకే అభిమానుల కోసం ఆయన మరోసారి గొంతు సవరించుకుంటున్నారట. ప్రస్తుతం పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఒక జానపద గీతం ఉందట. దాన్ని పవన్ కళ్యాణే స్వయంగా ఆలపిస్తారని అంటున్నారు. సాంగ్ చాలా బాగుంటుందని, అభిమానులు మెచ్చుకునే రీతిలో, ఎంజాయ్ చేసే తరహాలో ఉంటుందని తెలుస్తోంది. మరి పవన్ ఆలపించబోయే ఆ పాట ఏమిటో, ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే పవన్ చేసిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకానుంది.