Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా పవన్ కళ్యాణ్…. అడ్డంగా బుక్ అయిన బాబు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉన్నారో ఆయా ప్రాంతాలలో భారీ స్థాయిలో బహిరంగ సభలను ఏర్పాటు చేసి మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమి గెలుపుకు కారణమయ్యారు.

ఇక మహారాష్ట్రలో బిజెపి తిరిగి అధికారంలోకి రావడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణమని ఆయనపై పెద్ద ఎత్తున ప్రశంశల వర్షం కురిపించారు. ఇకపోతే త్వరలోనే ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూటమి తరుపున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారంటూ అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ఈ ప్రచార కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండగా చంద్రబాబు మాత్రం పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉన్న నేపథ్యంలో పలువురు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఈ ప్రచార కార్యక్రమాలకు వెళ్లకపోయినా చంద్రబాబు మాత్రం ఇష్టం లేకుండానే ఢిల్లీ ప్రచార కార్యక్రమాలకు వెళ్లి అక్కడ కేజ్రీవాల్ ఫై విమర్శలు కురిపిస్తున్నారు.

ఢిల్లీలో బిజెపికి పట్టం కట్టాలంటూ ఈయన మాట్లాడుతున్నారు కానీ గతంలో మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు నిరసన తెలియజేసిన నేపథ్యంలో చంద్రబాబుకు కేజ్రీవాల్ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ మొదటి నుండి బాబుకు గట్టి మద్దతుదారుడని చెప్పాలి.విజయవాడలోని సిక్కు ప్రాబల్య ప్రాంతాలలో చంద్రబాబు పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించే ఫోటోలో ప్రచారం చేశారు.

ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయటాన్ని ఏమాత్రం ఇష్టపడటం లేదు. కానీ ఈయన ఎన్డీఏ కూటమిలో భాగం కావడంతో తప్పనిసరి పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చింది కానీ ఈ ప్రచార కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ మెల్లిగా పక్కకు తప్పుకున్నారని ఇది కూడా ఒకంత మంచి విషయమే అని జనసైనికులు భావిస్తున్నారు.