మెగాస్టార్ మాస్ ప్రాజెక్ట్ కి పవన్ హాట్ హీరోయినా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆల్రెడీ “గాడ్ ఫాథర్” షూట్ లో ఉండగా “భోళా శంకర్” వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రాలకంటే ఇంకో సినిమాపై మాత్రం అంచనాలు ఇంకో స్థాయిలో ఉన్నాయి.

అదే “వాల్తేర్ వీరయ్య”(వర్కింగ్ టైటిల్). దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న ఈ సినిమాని మళ్ళీ మెగాస్టార్ పాత రోజులు గుర్తు చేసేలా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది తెలుస్తుంది.

ఈ సినిమాకి గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మూడు సార్లు నటించిన హాట్ హీరోయిన్ శృతి హాసన్ ని ఎంపిక చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఈ భారీ మాస్ ప్రాజెక్ట్ కి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.