HomeNewsప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించనున్న క‌మెడీయ‌న్ అలీ.. హాట్ టాపిక్‌గా మారిన కాంబినేష‌న్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించనున్న క‌మెడీయ‌న్ అలీ.. హాట్ టాపిక్‌గా మారిన కాంబినేష‌న్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ న‌డుస్తున్నాయ‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అలీ కాంబినేష‌న్‌లో ఇప్పుడు సినిమా రూపొంద‌నుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అన్ని సినిమాల‌లో అలీ ఏదో ఒక పాత్ర‌లో క‌నిపించ‌డం కామ‌న్ కాని, ఇప్పుడు ప‌వ‌న్‌ను హీరోగా పెట్టి అలీ సినిమా నిర్మించ‌నున్నాడ‌నే వార్త అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ని స్థాపించిన అలీ ప్ర‌స్తుతం నిర్మాత‌గాను సినిమాలు చేస్తున్నాడు. అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాను అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పైనే రూపొందించారు.

Pa Ali | Telugu Rajyam

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా అలీ సినిమా నిర్మించ‌నున్నాడ‌నే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ముందు స్నేహితులుగా ఉన్న అలీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు రాజ‌కీయాల వ‌ల‌న దూరం అయ్యారు. జనసేన కాకుండా మరో పార్టీలో చేరిన అలీపై అప్పట్లో పవన్ కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. దానిపై అలీ కూడా సీరియస్‌గానే స్పందించాడు. ఇది జరిగి ఏడాదిన్నర దాటిపోయింది. ఈ మ‌ధ్య‌లో వారు క‌లిసింది కూడా లేదు. అయితే రీసెంట్‌గా ఓ వేడుక‌లో వీరిద్ద‌రు క‌లిసి కనిపించగా, అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ ఇద్దరి మధ్య అన్నీ సమసిపోయాయని.. మళ్లీ కలిసి నటించడం ఖాయం అయిపోయిందని డిసైడ్ అయ్యారు.

అయితే ఇంత‌లోనే దావానంలా వ్యాపించిన వార్త ఒక‌టి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. కాట‌మ‌రాయుడు, గోపాల గోపాల సినిమాల ద‌ర్వ‌కుడు కిషోర్ కుమార్ పార్ధ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా అలీ సినిమాను నిర్మించ‌నున్నాడు అని ప్రచారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకుంటున్నాయి. ఈ కాంబినేష‌న్ సెట్ అయితే రికార్డులు బ‌ద్ధ‌ల‌వ్వ‌డం ఖాయం అంటున్నారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News