Home News నా ఒక్కడి పదవి కోసం.! పవన్ కళ్యాణ్ అలా ఎలా అన్నారు చెప్మా.?

నా ఒక్కడి పదవి కోసం.! పవన్ కళ్యాణ్ అలా ఎలా అన్నారు చెప్మా.?

Pawan Kalyan'S Strong Coments Against Chiranjeevi?

పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, అది ఏదో ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవికి గట్టిగా తగిలేస్తోంది. ‘నా ఒక్కడి పదవి కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు.. ఒకవేళ పదవి కోసమే నేను ఆలోచిస్తే, ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయేవాడిని..’ అంటూ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఉలిక్కిపడ్డారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, చిరంజీవి కేంద్ర మంత్రి అయిన విషయం విదితమే. దాన్ని, పవన్ తాజా వ్యాఖ్యలకు జత చేస్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో. అయితే, పవన్ కళ్యాణ్ ఓ విషయం గుర్తుంచుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారు.. బీజేపీ – టీడీపీలకు మద్దతిచ్చారు.

ఆ సమయంలోనే ఆయన కేంద్ర మంత్రి పదవి పొంది వుంటే, అది జనసేన పార్టీకి రాజకీయంగా మేలు చేసేదే. పదవులు వద్దు.. రాజ్యాధికారం మీద ఆశ లేదు.. అని ఓ పక్క చెబుతూనే, ఇంకోపక్క జనసేన ప్రభుత్వం వస్తుంది.. అని పవన్ చెబుతుండడం పట్ల జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులే గందరగోళంలో పడిపోతున్నారు.

పదవి చేతిలో వుంటే పవర్ చేతిలో వుంటుంది.. ఆ పవర్, ప్రజా సేవ కోసమే కాదు, రాజకీయ పార్టీని బలోపేతం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఆర్నెళ్ళకో, సంవత్సరానికో.. ఓ సారి పార్టీ కార్యక్రమాల్లో బీభత్సమైన ప్రసంగం చేసేసి, పంచ్ డైలాగులు పేల్చితే, దాని వల్ల పార్టీకి ఉపయోగం వుండదు.. ప్రజలకూ ఉపయోగం వుండదు.

నిజమే, ప్రజలు సమస్యల్లో వుంటే.. వెంటనే పవన్ కళ్యాణ్ వారికి గుర్తొస్తున్నాడు. కానీ, ఆ పవన్ కళ్యాణ్ ఆ ప్రజల కోసం ఏం చేయగలుగుతున్నాడు.? అన్నది లెక్క తీస్తే.. జనసేన సంగతేంటో తేలిపోతుంది. అమరావతి విషయంలోగానీ, మరో విషయంలోగానీ పవన్ కళ్యాణ్ చేసిందేంటి.? సాధించిందేంటి.? జనసైనికులకీ పవర్ రావాలంటే.. జనసేన అధినేతకి పవర్ వుండాలి.

ఆ పవర్ కేంద్ర మంత్రి పదవి రూపంలోనా.? రాష్ట్రంలో అధికారమా.? అన్నది తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణే. మిత్రపక్షం బీజేపీ గనుక, ఆ పార్టీ అధికారంలో వున్న కేంద్రం నుంచి పదవి దక్కించుకోవడం పవన్ ముందున్న బెస్ట్ ఆప్షన్. కానీ, అందుకాయన సుముఖత వ్యక్తం చేయడంలేదు

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News