పవన్ వారసుల ఎంట్రీ.. మొదట కూతురే

Pawan Kalyan's daughter to appear on TV show

Pawan Kalyan's daughter to appear on TV show

పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని పెద్దగా బయటకు తీసుకురారు. ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్ప వేరే ఎక్కడా కనిపించరు వాళ్ళు. అయితే పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ మాత్రం పిల్లల్ని సోషల్ మీడియాలో చూపెడుతోనే ఉంటారు. ఇప్పుడు ఆమె ఏకంగా వారిని కెమెరా ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. కుమార్తె ఆద్యను మొదటిసారి బుల్లితెర మీద ప్రజెంట్ చేస్తున్నారు. జీతెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మథర్స్ డే సంధర్బంగా స్పెషల్ షో ఒకటి ప్లాన్ చేశారు. అందులో ఆధ్య కనబడనుంది.

దానికి సంబంధించిన ప్రోమో కూడ రిలీజ్ అయింది. మే 9న ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. పవన్ కుమార్తెను బుల్లితెర మీద చూడబోతున్నందుకు అభిమానులు ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తిగా ఉన్నది మాత్రం అఖీరా నందన్ ఎంట్రీ మీదనే. అఖీరా చిన్నవాడే అయినా సినిమాల్లోకి వస్తాడా రాడా అనే మీమాంస కొనసాగుతోంది. పవన్, రేణుల నడుమ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండటమే అందుకు కారణం. పవన్ వారసత్వాన్ని అఖీరా కొనసాగించడానికి రేణు దేశాయ్ సహకరిస్తారా లేదా సంశయం ఉంది. కానీ రేణు మాత్రం అఖీరా ఇష్టపడి వెళ్తానంటే తప్పకుండా ప్రోత్సాహిస్తానని గతంలో అన్న సంగతీ తెలిసిందే.