Pawan Kalyan: కేవలం నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తి చేసిన పవన్.. సూపర్ స్టార్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Pawan Kalyan: టాలీవుడ్ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడం కోసం డేట్స్ ఇచ్చారు. ఒక వైపు సినిమాలు మరొకవైపు ప్రభుత్వ పాలన ఇలా రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. సినిమాలు రాజకీయాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులను చకచకా పూర్తి చేసేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ ఓజీ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేయగా ఈ సినిమా జూన్ 12న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ చెప్పారు. నిన్న అంతా పవన్ ఓజీ మూవీ షూట్ చేసి ఆ తర్వాత రాత్రికి 10 గంటలకు డబ్బింగ్ మొదలు పెట్టారు. అయితే కేవలం నాలుగే నాలుగు గంటల్లోనే సినిమా అంతా డబ్బింగ్ పూర్తి చేసేసారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా హీరోలు డబ్బింగ్ అంటే సినిమా మొత్తానికి ఒక మూడు నాలుగు రోజులు కూడా తీసుకుంటారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఒక రోజంతా తీసుకుంటారు డబ్బింగ్ కోసం. అలాంటిది పవన్ పొద్దునంతా షూట్ చేసి రాత్రికి మళ్ళీ కంటిన్యూగా నాలుగు గంటలు డబ్బింగ్ చెప్పి సినిమా మొత్తం పూర్తి చేసాడంటే గ్రేట్ అంటున్నారు. ఇలా పవన్ పగలు రాత్రి లేకుండా కష్టపడుతుండంతో అభినందించాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే, అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు ఇప్పుడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. దీంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.