Pawan Kalyan : ఇండస్ట్రీ గాసిప్స్ : ఈ 100 కోట్ల యంగ్ మెగా హీరోతో పవన్ కనిపించనున్నాడా..?

Pawan Kalyan :ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో కూడా లేని విధంగా సూపర్ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు మన టాలీవుడ్ నుంచి వస్తున్నాయి అని చెప్పాలి. భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR), నుంచి “ఆచార్య” తర్వాత మాస్ సినిమా “భీమ్లా నాయక్” లాంటి సాలీడ్ మల్టీస్టారర్ లు రెడీ గా రిలీజ్ కోసం ఉన్నాయి.

మరి వీటి తర్వాత మరిన్ని మల్టీస్టారర్ లు కొనసాగుతాయా అంటే నిజమే అని ఇండస్ట్రీలో వ్యక్తులు చెబుతున్నారు. మరి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకో క్రేజీ మల్టీస్టారర్ మూవీ లో నటిస్తాడని తెలుస్తోంది. మరి అది కూడా తన మొదటి సినిమా ఉప్పెన తోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో అన్నట్టు వినికిడి.

ఇంకా దర్శకుడు ఎవరు కథ ఏంటి అనేవి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ కాంబోలో సినిమా అయితే కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తోంది. మరి అలాగే ఈ సినిమాని ఒక ప్రముఖ బిగ్ బ్యానర్ వారు నిర్మాణం వహించనున్నారని తెలుస్తోంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.