Pawan Kalyan : జానీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు.?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి ఎంతో మంది వీరాభిమానులున్నారు. వారంతా ఆయని దేవుడిగా భావిస్తుంటారు. అలాంటి వీర భక్తుల్లో ఒకడు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ బోలెడంత పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాదు, అదో టైపు పిచ్చ ప్రేమ అనుకోవాలేమో. అంతలా పవన్‌ని అభిమానిస్తుంటాడాయన. డాన్స్ కొరియోగ్రఫర్ అయినప్పటికీ జానీ మాస్టర్ మల్టీ టాలెంటెడ్. తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడాయన.

అయితే, మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయడం, రాజకీయాల్లోకి రావడం తదితర అంశాలతో జానీ మాస్టర్  కల కల్లగానే మిగిలిపోయిందనుకున్నారంతా. అయితే, జానీ మాస్టర్ పొలంలోనూ మొలకలొచ్చాయ్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

ఇప్పటికే ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఓకే చేస్తూ, పూర్తయిన సినిమాని పూర్తయినట్లే రిలీజ్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఆయా సినిమాలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో పవన్‌తో జానీ మాస్టర్ సినిమా తీయాలన్న కోరిక నెరవేరే సమయమొచ్చిందా.? అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు.

అన్నీ కలిసొస్తే, త్వరలోనే ఆ ప్రాజెక్టుపై ఓ అప్‌డేట్ కూడా రానుందట. మరోవైపు జానీ మాస్టర్ ఓ వైపు తెలుగులో కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తూనే, తమిళంలోనూ విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలకు సైతం డాన్స్ స్టెప్పులు కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అలాగే బుల్లితెరపై కొన్ని రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు కూడా.