Balakrishna: బాలయ్య బాబుకు స్పెషల్ బర్త్డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్!

Balakrishna: టాలీవుడ్ అగ్ర హీరో, నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. 100కు పైగా సినిమాలలో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసాయి. ముఖ్యంగా ఆయన చెప్పే మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తూ ఉంటాయి. ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా సినీమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు.

గతంలో విడుదల అయినా అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది ఇలా ఉంటే నేడు అనగా జూన్ 15 బాలయ్య బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బాలయ్య బాబుకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో బాలయ్య బాబు ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

దానికి తోడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అఖండ 2 సినిమా టీజర్ రావడంతో అభిమానుల సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పటికే చాలామంది బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య బాబుకు స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడు ఆయన. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్‌ కల్యాణ్‌ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు కూడా బాలయ్య బాబుకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో జై బాలయ్య అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు.