ఔను, నిఖార్సయిన ‘వకీల్ సాబ్’ ఈ పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan, The True Vakeel Saab

దిల్ రాజు.. పరిచయం అక్కర్లేని పేరిది. రెండు దశాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించడానికి. ఏదో సినిమా ఫంక్షన్ కోసం మాట్లాడిన మాటల్లా లేవు. గుండె లోతుల్లో పవన్ కళ్యాణ్ కోసం గుడి కట్టేసుకున్న ఓ సగటు అభిమాని మాటలు స్పష్టంగా అందరికీ అర్థమయ్యాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎలా ఆయన్ని అప్రోచ్ అవ్వాలో దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతకు తెలియలేదంటే, ఆసామాషీ వ్యవహారం కాదది. అప్పుడెప్పుడో ‘తొలిప్రేమ’ సినిమాకి పంపిణీ దారుడు.. ఇప్పుడేమో నిర్మాత. ‘మీతో సినిమా చేయాలన్న నా కోరిక నెరవేరింది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సంగతి పక్కన పెడితే, మీరు నాకు చెప్పిన రెండు మాటలు నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను..’ అని చెమర్చిన కళ్ళతో దిల్ రాజు చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఏంటి ఆ రెండు మాటలు.? అవేంటో పవన్ కళ్యాణ్ – దిల్ రాజుకి మాత్రమే తెలుసు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు నిర్మాతగా పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారు. అది కూడా అతి త్వరలోనే అనౌన్స్ కాబోతోందట. దర్శకుడెవరన్నది కూడా చూచాయిగా ఖరారైపోయిందని అంటున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా వేదికపైనా రాజకీయాలు మాట్లాడారు. తన మీద వస్తున్న విమర్శలకు బలంగా సమాధానమిచ్చారు. అంటే, కోర్టులో వాదించడం మాత్రమే కాదు.. సినిమా వేదికపైనా వాదనలు చేయగల సత్తా తనకుందని నిరూపించుకున్నారన్నమాట. గతంలో పవన్ ప్రసంగాలకీ, తాజా ప్రసంగానికీ స్పష్టమైన మార్పు వుంది. ఔను, పవన్ కళ్యాణ్ నిఖార్సయిన వకీల్ సాబ్.. అని ఇకపై ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరాల్సిందేనేమో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles